YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బాబుకు కుప్పం టెన్షన్

బాబుకు కుప్పం టెన్షన్

తిరుపతి, జూలై 8,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అసలు విషయం తెలిసి వచ్చింది. కుప్పం నియోజకవర్గంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి రివర్స్ అవుతుందన్న దిగులు పట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు తరచూ కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షిస్తున్నారు. తరచూ అక్కడి అధికారులు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు.కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారు. అక్కడ పరిస్థితులను వైసీపీ తన గ్రిప్ లోకి తెచ్చుకుంటోంది. ఇటీవల కొందరు నమ్మకమైన టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ చేశారు. మరోవైపు అధికార పార్టీ అక్కడ అభివృద్ధి పనులను కూడా నిలిపివేయడంతో చంద్రబాబు లో ఆందోళన మొదలయింది. దీంతో ఆయన తరచూ కుప్పం నియోజకవర్గం నేతలతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.నిజానికి కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు పెట్టని కోట. ఆయన ఏడుసార్లుగా అక్కడి నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. 1989 నుంచి 2019 వరకూ వరసగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుదే విజయం. ఫస్ట్ టైం చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో మెజారిటీ తగ్గింది. ఒక రౌండ్ లో వెనకబడి కూడా పోవడం విశేషం. దీంతో కుప్పంలో మరింత శ్రద్ధ పెడితే ఈసారి గెలవచ్చన్న వ్యూహంతో అక్కడ వైసీపీ పకడ్బందీ ప్రణాళిక రచించింది. ఇందుకోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఆపరేషన్ చేస్తుండటం విశేషం.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇటీవల హంద్రీ, నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగమైన కుప్పం కాల్వల పురోగతిపై సమీక్షించారు. ప్రభుత్వం కాలవ పనులను ఆపేసిందని ఆరోపించారు. 90 శాతం పనులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తే పదిశాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయకుండా పక్కన పెట్టేసిందని ఆయన ఆరోపించారు. దీనిపై స్థానిక నేతల చేత ఆందోళన చేయించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎప్పుడూ కుప్పం గురించి ఆలోచించలేదు. ఈసారి మాత్రం చంద్రబాబుకు కుప్పంపై కొంత దిగులు పట్టుకుందనే చెప్పాలి.

Related Posts