YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతిపై బీజేపీ ఎటు...

అమరావతిపై  బీజేపీ ఎటు...

విజయవాడ, జూలై 8, 
అమరావతి లో ఉన్న రాజధాని మూడు ముక్కలు చేయరాదనగానే బిజెపి తరపున తక్షణం సీన్ లోకి వచ్చేది రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. తాజాగా అమరావతి ఉద్యమం 2.0 లో కూడా సుజనా ప్రత్యక్షం అయిపోయారు. వర్చ్యువల్ గా సాగుతున్న అమరావతి ఉద్యమం లో కానీ టివి ఛానెల్స్ కు ఇచ్చే ఇంటర్వ్యూలలో గతంలో చెప్పే మాటనే ఆయన వల్లెవేస్తున్నారు. అమరావతిని జగన్ సర్కార్ అంగుళం కదిలించలేరు. ఆ విషయం గతంలో చెప్పా ఇప్పుడు చెబుతున్నా అంటూ మళ్ళీ కమలం తరపున తమ బాణీ వినిపించేశారు. అక్కడితో ఆగకుండా కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందంటూ భరోసా ఇచ్చేశారు.సుజనా చౌదరి ఇలా మాట్లాడినప్పుడు గతంలో జివిఎల్ దీనికి భిన్నంగా మాట్లాడేవారు. రాజధాని అంశం రాష్ట్ర సర్కార్ దే ఫైనల్. ఇందులో కేంద్రం జోక్యం ఉండబోదు. అయితే ఈసారి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ డోస్ సరిపోదని భావించిన బిజెపి అదే మాటను సునీల్ దేవధర్ తో చెప్పించేసింది. అయితే ఆయన విసిరిన రాజధాని గుగ్లీ చర్చనీయాంశమైంది. తమ పార్టీలో ఉంటూ అధిష్టానం తామే అన్నట్లు వ్యవహరిస్తున్న గోడదూకిన టిడిపి మాజీ లపైనా లేక జనసేన పైనా కాక కామ్రేడ్ లను కలుపుకుని ఉద్యమిస్తున్న టిడిపి పైనా అన్నది డిబేట్ అయింది.రాజధాని తరలింపు వ్యవహారం పై ఎపి బిజెపి గా వ్యతిరేకిస్తామని అయితే దీన్ని అడ్డుకోవడానికి కేంద్రానికి అధికారం లేదని సీనియర్ కమలం నేతలు పదేపదే ప్రకటిస్తూనే ఉన్నారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టయిష్టాలపైనే తరలింపు ఆధారపడి ఉంటుందని గత కొంతకాలంగా బీజేపీ పెద్దలు చెబుతూనే వస్తున్నారు. అయినా కానీ కొత్తగా కాషాయం కప్పుకున్న పాత సైకిల్ బ్యాచ్ ఉద్యమ కారులను తప్పుదారి పట్టిస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు నడుస్తుంది.

Related Posts