హైద్రాబాద్, జూలై 8,
టర్ హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి ప్రజ లకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం గా బస్తీదావఖానాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. గ్రేటర్‌లోని హైద రాబాద్, రంగారెడ్డి,మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 1000 బస్తీ దావఖానాలను ఏర్పాటు చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే మొదటిదశలో 200 దవాఖానాలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయిం చింది. వీటిలో ఇప్పటి వరకు 167దావఖానాలను ఏర్పాటు చేశారు. మరో 33దావఖానాలను సిద్ధం చేశారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొ చ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో బస్తీ దావఖానాల సంఖ్య 200కు చేరనుంది. మొదటి విడతలో 123, రెండో విడ తలో 44 బస్తీ దావఖానాలను ప్రభుత్వం ప్రారం భించింది.మూడో విడతలో 33దావఖానాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో బస్తీలు, కాలనీ వాసులకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువకానుంది. బస్తీ దావా ఖానాలను ఏర్పాటు చేసేందుకు జీహె చ్‌ఎంసీ ద్వారా వసతి, ఇతర మౌలిక వసతులు కల్పించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యు లు, పారామెడికల్ సిబ్బందిని నియమించి కాలనీ వాసులకు ప్రాథమిక వైద్య సేవలను అందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షల మేరకు పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలు, బస్తీలకు ప్రభుత్వం వైద్యాన్ని అందించేం దుకుగాను ఈ దావాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా 2019లో ఏర్పాటు చేసిన 123 బస్తీ దావాఖానాలకు అదనంగా 2020 మే 22న మరో 44 బస్తీ దావాఖానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతి వార్డుకు కనీసం రెండు చొప్పున బస్తీ దావాఖానాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా మరో 33 బస్తీ దావా ఖానాలను ప్రారంభించడానికి వసతులు కల్పించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. దీంతో నగరంలో బస్తీ దవాఖానాల సంఖ్య 200లకు చేరుతుందని తెలిపారు.బస్తీ దావఖానాలకు రోగులు భారీ సంఖ్యలోనే వసు ్తన్నారు. ఒక్కో కేంద్రానికి రోజుకు 80-100 మంది రోగు లు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా నేప థ్యంలో జ్వరం, దగ్గు, జలుబు ఉన్నవారు ఎక్కువగా వస్తున్నారు. ఒక్కో దవఖానాకు కనీసం 20-30 మంది రోగులు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమ యాల్లోనూ సేవలందిస్తున్నారు. 10 బస్తీ దావఖానాల్లో మహిళలు, పిల్లల వైద్య నిపుణుల ద్వారా ప్రత్యేక సేవలందిస్తున్నారు.