తిరుమల జూలై 8,
కనుమ మలుపుల్లో కనుచూపు మేర పరచుకున్న పచ్చదనం.. ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, గోవింద నామస్మరణలు చేసుకుంటూ ఉల్లాసంగా ముందుకు సాగుతున్న భక్తజనులను ఈ ఇంద్రధనుస్సు ఉల్లాసాన్ని అందించింది. సుదూర తీరాలనుంచి ఎగురుకుంటూ వచ్చి కొండకొమ్మలపై సేదదీరుతున్న మేఘాలు.. అక్కడక్కడా జలపాత సోయగాలు.. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రస్తుతం కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు తిరుమల గిరికి సరికొత్త శోభను అందించాయి. ఇంద్రధనస్సును మురిపించేలా నీలిలాకాశంలో అద్భుతమైన దృశ్యకావ్యం వెంకన్న భక్తులను ఆకట్టుకుంది