YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మారటోరియం మాకొద్దు..విరమించుకుంటున్నరుణగ్రహీతలు

మారటోరియం మాకొద్దు..విరమించుకుంటున్నరుణగ్రహీతలు

న్యూ ఢిల్లీ జూలై 8 
లాక్ డౌన్ తో ప్రజలందరి ఆర్థిక మార్గాలు మూసుకుపోయాయి. దీంతో నిత్యావసరాల కోసం వచ్చే ఆదాయం మిగిల్చుకుంటున్నారు. ఈ సమయంలో రుణాల చెల్లింపులు.. ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని గుర్తించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈఎంఐల చెల్లింపు వాయిదా వేసింది. మూడు నెలల చొప్పున ఆరు నెలలు రుణ చెల్లింపులు వాయిదా వేసింది. ఈ అవకాశాన్ని ఆదాయ మార్గాలు కోల్పోయిన వారు వినియోగించుకున్నారు. ప్రస్తుతం అన్ లాక్ దశ మొదలై సాధారణ పరిస్థితులు రావడంతో ఇప్పుడు అందరూ తమ రుణాలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు ఈ సందర్భంగా మారటోరియం వెనక్కి తీసుకుంటున్నారు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావడంతో కొంతమంది మారటోరియం వెసులుబాటును విరమించుకుంటున్నారు. తమ బ్యాంకు రుణ గ్రహీతల్లో కేవలం 30 శాతం మంది ఉద్యోగులు మాత్రమే మారటోరియం వెసులుబాటును ఉపయోగించుకుంటున్నారని మిగతా 70 శాతం మంది తమ ఈఎంఐలు కొనసాగిస్తున్నారని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ మల్లికార్జున రావు చెప్పారు. తాత్కాలికంగా మారటోరియాన్ని ఉపయోగించుకున్న వారు కూడా ఇప్పుడు ఈఎంఐలలోకి మారుతున్నారని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
జూన్ నెల నుంచి అన్-లాక్ ప్రారంభమైందని నగదు క్రమంగా చేతుల్లోకి వస్తోందని చెబుతున్నాయి. రుణ గ్రహీతల చేతుల్లోకి నగదు వస్తుండటంతో ఈఎంఐ తాత్కాలిక నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. ఈఎంఐలపై మారటోరియం ఆగస్ట్ నెల వరకు ఉంది. మొదట మూడు నెలలు ఆ తర్వాత మూడు నెలలు పొడిగింపు.. మొత్తం 6 నెలలు వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పుడు వినియోగదారులు ఈఎంఐలు తిరిగి చెల్లించడం ప్రారంభించారని ఓ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. అయితే మారటోరియం అవకాశం కల్పించినా చాలామంది వినియోగించుకోలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.  20 మంది ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మిగతా 80 శాతం మంది గృహరుణ కస్టమర్లు మారటోరియం ఉపయోగించుకోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం నగదు లభ్యత పెరుగుతుండటంతో రుణాల చెల్లింపుకు ముందుకు వస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. అంతటా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా పలువురు రుణగ్రహీతలు మారటోరియం నుంచి బయటకు వస్తున్నారు. సూక్ష్మ రుణగ్రహీతలకు నగదు లభ్యత పెరిగిందని అందుకే వారు మారటోరియంను వద్దనుకుంటున్నారు.

Related Posts