YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హైదరాబాద్ ఎవరబ్బ సొత్తు కాదు సెక్షన్ 8 అంటే నాలుక కోస్తారు విపక్షాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిప్పులు

హైదరాబాద్ ఎవరబ్బ సొత్తు కాదు  సెక్షన్ 8 అంటే నాలుక కోస్తారు విపక్షాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిప్పులు

హైదరాబాద్ జూలై 8  
విపక్షాలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిప్పులు చెరిగారు. సచివాలయంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విషాన్ని కక్కుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వెనుకబాటుకు ఆంధ్రా నాయకులు కారణమని ఇన్ని రోజులు భావించాం.. కానీ ఇక్కడి నాయకులే కారణమని ఇప్పుడు అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. ‘‘పాత సచివాలయంలోకి కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్లలేని పరిస్థితి ఉంది. సచివాలయం రాష్ట్రానికి ఒక ఐకాన్‌గా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్షాల నాయకులు కోర్టు తీర్పును ధిక్కరించి మాట్లాడుతున్నారు. ఉత్తమ్.. ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకో.. తెలంగాణ ఉద్యమంలో నువ్ ఎక్కడున్నావ్. బిల్డింగ్‌లు అప్పగించి ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆంధ్ర వారిలా మీరు సెక్షన్ 8 అంటారా?, సెక్షన్ 8 అంటే నాలుక కోస్తారు. పక్కవారిని ఉసిగొల్పేలా మాట్లాడతారా?, హైదరాబాద్ ఎవరబ్బ సొత్తు కాదు తెలంగాణది. తెలంగాణపై ఇతరుల పెత్తనాన్ని ఒప్పుకోం. ఆరేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణకు గోల్డెన్ డే. అయినా కేసీఆర్ ఎక్కడుంటే మీకేంటి?, ఏమైనా పథకాలు ఆగినయా?, రైతుబంధు డబ్బులు ఆగినయా?, సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ నేతలే అక్కడ సెల్ఫీ దిగుతారు. బీజేపీ నేతలకు దిమాక్ ఖరాబయింది. పార్లమెంట్ కూలిస్తే శభాష్. సచివాలయం కడితే తప్పా?, రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో ఒక్కటయ్యాయి. రెండు పార్టీలు తెలంగాణ పట్ల పగ పెంచుకున్నాయి.’’ అని శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts