YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

21 నుంచి టీఎంసీ ప్రచార భేరి

21 నుంచి టీఎంసీ ప్రచార భేరి

కోల్ కత్తా, జూలై 9, 
మమత బెనర్జీ ఎన్ని కల శంఖారావాన్ని పూరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో కరోనా విలయతాండవం చేస్తున్నా రాజకీయాలకు మాత్రం కొదవలేదు. ప్రధానంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో మమత బెనర్జీ ఇక ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అందుకు ముహూర్తం ఈ నెల 21వ తేదీగా నిర్ణయించారు. ప్రతి ఏటా జులై 21వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తుంది.అయితే ఈసారి కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమరవీరుల దినోత్సవాన్ని సాదాసీదాగా జరుపుకోవాలని మమత బెనర్జీ నిర్ణయించారు. అయితే ఇదే రోజు మమత బెనర్జీ దాదాపు 2.5 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు మమత బెనర్జీ ప్రకటించారు. మమత బెనర్జీ అధికారికంగా ఈ నెల 21 వతేదీన ప్రచారం ప్రారంభిస్తున్నట్లు చెప్పినా ఆమె ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యారు.గత ఏడాదిన్నరగా మమత బెనర్జీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో దాదాపు 80 వేల పోలింగ్ బూత్ లున్నాయి. మమత బెనర్జీ ప్రత్యేకంగా బూత్ లెవల్ లీడర్లతో రోజూ ఎంపిక చేసిన వారితో మాట్లాడుతున్నారు. ప్రతి బూత్ లో దాదాపు 30 మంది వరకూ సుశిక్షితులైన కార్యకర్తలు ఉండాలని ఆమె పార్టీ నేతలను ఆదేశించారు. వారి నుంచి మమత బెనర్జీ ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను కూడా మమత బెనర్జీ ఉపయోగించుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై పీకే టీం ఒక దఫా ఇప్పటికే సర్వే చేసింది. ఎన్నికల నాటికి నాలుగుసార్లు అభ్యర్థులపై సర్వే చేయించాలని మమత బెనర్జీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఇప్పటికే బీజేపీ ఆరు వర్చువల్ సమావేశాలను ఏర్పాటు చేసి ముందుంది. అందుకే మమత బెనర్జీ వర్చువల్ మీటింగ్ ద్వారా దాదాపు 2.5 లక్షల మంది కార్యకర్తలతో ఈ నెల 21వ తేదీన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని మమత బెనర్జీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈసారి బెంగాలీలు ఎటువైపు నిలుస్తారో చూడాల్సి ఉంది.

Related Posts