హైదరాబాద్ జూలై 9
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 9,10,11,12 తరగతులకు 30% తగ్గించిన సాంఘీక శాస్త్ర సిలబస్ లో భారత రాజ్యాంగ లక్ష్యాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించటం శోచనీయమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రాజ్యాంగం ప్రకారం పాలనలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ లక్ష్యాలను విద్యార్థులకు తెలియకుండా చేయాలను కోవటం అవివేకమే. కేంద్రప్రభుత్వం ముందుగా పాఠశాలలు ప్రారంభించడానికి అవసరమైన నిబంధనలు జారీ చేయాలని కోరారు. సిలబస్ తగ్గింపు తర్వాత చేయవచ్చు. సిలబస్ తగ్గింపు ఉత్తర్వులు ఉపసంహరించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయాలని నర్సిరెడ్డి కోరారు.