భోపాల్ జూలై 9
ఉత్తర ప్రదేశ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అతడిని అదుపులోకి తీసుకు న్నారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను బలి తీసుకున్న ఘటనలో వికాస్ దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటివరకు అతని నలుగురి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్ స్టర్ కు అత్యంత సన్నిహితుడు, అతని బాడీగార్డు అమర్ దూబేను పోలీసులు బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో కాల్చి చంపేశారు. ఇతనిపై 25 వేల రూపాయల రివార్డు కూడా ఉంది. వికాస్ దూబేకు సన్నిహితంగా ఉండే మరో ఇద్దరిని పోలీసులు హతమార్చారు. ప్రభాత్ మిశ్రా, భవన్ శుక్లా పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసినట్లు తెలిపారు.
ఉదయం ఉజ్జయినిలోని మహంకాళీ ఆలయంలో దుబే వున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతకుముందు దుబే అక్కడ పూజ సామాగ్రి కోనుగోలు చేస్తున్నప్పుడు ఆ దుకాణం యజమాని పోలీసులకు ఉప్పందించాడు. దుబేను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేయాల్సివచ్చింది