అమరావతి జూలై 9
పేదలందరికీ ఇచ్చే ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పగ సాధించడమే కాకుండా, దొంగే దొంగా దొంగా అని అరచినట్లు తెలుగుదొంగల పార్టీ నిరసన దీక్షలకు దిగుతుందట అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి గురువారం విమర్శలు గుప్పించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు టీడీపీ నాయకులు పట్టాల పంపిణీని వాయిదా వేయకుండా తక్షణమే ఇవ్వాలనే డిమాండు చేస్తున్నారని చెప్పారు. నాడు అడ్డుకున్న వాళ్లే నేడు ఇవ్వాలని అడుగుతూ సిగ్గు విడిచిన రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయడం లేదని పచ్చ పార్టీ నేతలు ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కడిగిపారేశారని చెప్పారు. చంద్రబాబు ఎక్కడ హర్ట్ అవుతాడోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ సైలెంట్ అయ్యారని తెలిపారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు సిద్ధమైన దగ్గరి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకు టెన్షన్ పట్టుకుందని విమర్శించారు.ఐదేళ్లుగా అయ్యతో కలిసి ఐదు లక్షల కోట్ల రూపాయలు తిన్న గిత్త ఐదు నెలలుగా నోరు కట్టుకుని ఐదు కేజీలు తగ్గిందని మరో ట్వీట్ చేశారు. దాని పేరు మాత్రం తనను అడగొద్దని కోరారు.