హైదరాబాద్ జూలై 9
భర్త ఇంటి ముందు భార్య ధర్నా కాపురానికి తీసుకెళ్ళాలని ఆందోళన తల్లిదండ్రులు , తమ్ముడు ప్రోద్బలంతోనే తనను పుట్టింటికి భర్త వెల్లగొట్టాడని భార్య ఆరోపణ...
సరూర్ నగర్ శ్రీసాయికృష్ణ నగర్ కు చెందిన బూరం సంతోష్ కుమార్ కు నాగర్ కర్నూలు కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ గజ్జెల శేఖర్ కుమార్తె మౌనిక తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. మౌనిక భర్త గోవా లో రెస్టారెంట్ లో మేనేజర్ ఉద్యోగం చేస్తూన్నాడు. కాపురం సజావుగా సాగుతున్న తరుణంలో మౌనిక గర్భవతి గా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఉద్యోగం మానేసి , హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుందామని భార్య ను హైదరాబాద్ కు పంపించాడు. ఉద్యోగం మానేయడం ఎందుకు అని భార్య ప్రశ్నిచడం తో , భార్య మౌనిక పై మతిస్థిమితం సరిగా లేదని సంతోష్ , అతని తల్లిదండ్రులు , తమ్ముడు ప్రోద్బలంతో మౌనిక ను తల్లిదండ్రులు వద్దకు పంపించారు.
ఈ క్రమంలో ఇరు కుటుంభాలు సర్దిచెప్పి వేరే చోట కాపురం పెట్టించారు,. వారికి బాబు పుట్టిన తరువాత కూడా సరిగా పట్టించుకోకపోవడంతో మౌనిక ను , బాబును తన తల్లిదండ్రుల వద్ద వదిలేసి విడాకులు కావాలని నోటీసులు పంపించాడు. ఈ క్రమంలో కరోనా , లాక్ డౌన్ నేపథ్యంలో మూడు దఫాలుగా నాగర్ కర్నూలు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ న్యాయం జరగడం లేదని, తనను కాపురం కు తీసుకవెళ్లడం లేదని, మౌనిక గురువారం భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.