రంగారెడ్డి జూలై 9
రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. ఇటీవలే షాబాద్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన శంకరయ్య గతంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసు స్టేషన్ లో పనిచేశారు. అక్కడ పని చేసినప్పుడు ఆయనపై భూ అక్రమాల నేపథ్యంలో ఆరోపణలు రావడంతో సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. తాజాగా శంకరయ్య లంచం తీసుకుంటఊ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక భూమి విషయంలో వివాదం లో అయన లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి గురువారం నాడు ఇనెస్పె క్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ లక్షా ఇరవై వేల రూపాయాలు లంచం తీసుకుంటునప్పుడు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు