హైదరాబాద్ జూలై 9
కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరోనా మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం గాలికొదిలేసింది కాబట్టే.. కరోనా కట్టడికి గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దేశంలో ఎక్కడా గవర్నర్ ఆస్పత్రులను పరిశీలించిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. కరోనా కట్టడికి కేంద్రం కూడా ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో చేసినన్ని కరోనా టెస్టులు తెలంగాణలో చేయటంలేదని విమర్శించారు. తీరా ప్రశ్నిస్తే ఐసీఎంఆర్ గైడ్ లెన్స్ పేరుతో మంత్రులు ఎదురు చేయటం దారుణం అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే ప్రజలు సమస్యల పరిష్కారం కోసం రాజ్‌భవన్ బాట పట్టారని స్పష్టం చేశారు.