YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

కరోనా కట్టడికి రంగం లోకి కమాండోలు!

కరోనా కట్టడికి రంగం లోకి కమాండోలు!

తిరువనంతపురం జూలై 9 
కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం, ప్రజలు నిబంధనలను అతిక్రమించకుండా ఉండటానికి ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది. ప్రస్తుతం ఇది  చర్చనీయాంశంగా మారింది. తిరువనంతపురంలోని పుంథూరాలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలో గత ఐదు రోజుల్లో ఆరు వందల మందికి కరోనా పరీక్షలు చేయగా, 119 మందికి పాజివ్‌ వచ్చింది కేరళలో ఇప్పటివరకు 5894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 మంది మృతిచెందారు. ప్రస్తుతం 2415 యాక్టివ్‌ కేసులు ఉండగా, 3452 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న 272 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రంగం కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా పుంథూరా ప్రాంతంలో కమాండోలను మోహరించారు. కరోనా నిబంధనలను అమలు చేయడాని పుంథూరాలో స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు చెందిన 25 మంది కమాండోలను నియమించామని డీజీపీ తెలిపారు. అదేవిధంగా చేపల బోట్లు సముద్రంలోకి వెళ్లకుండా, తమిళనాడు నుంచి బోట్లు తిరిగి రాకుండా కోస్ట్‌గార్డ్‌, కోస్టల్‌ సెక్యూరిటీ, మెరైన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బలగాలను మోహరించామని వెల్లడించారు. కేరళలో ఇప్పటివరకు 5894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 మంది మృతిచెందారు. ప్రస్తుతం 2415 యాక్టివ్‌ కేసులు ఉండగా, 3452 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న 272 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి

Related Posts