తాడిపత్రి జూలై 9
అనంత జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పిన వివాదాస్పద ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. అయన ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారు. హిందూ, ముస్లిం దేవుళ్ళ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రెండేళ్ల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై, ప్రబోధానంద స్వామి శిష్యులు దాడికి పాల్పడడంతో ఈ ఆశ్రమం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాది మంది మంది భక్తులను సంపాదించుకున్న ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందారు. 1950లో ప్రబోధానంద జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె ఆయన స్వగ్రామం. మొదటగా పెద్దన్న చౌదరిగా భారత సైన్యంలో వైర్‌లెస్ ఆపరేటర్‌గా పనిచేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేశారు. వైద్యుడిగా కొనసాగుతూ ఆయుర్వేదంపై పుస్తకాలు రాశారు. అంతేకాదు ఆధ్యాత్మిక అంశాలపైనా గ్రంథాలు రచించారు. తర్వాత ఆధ్మాత్మిక గురువుగా మారిపోయారు. తాడిపత్రి మండలం, చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరాన్ని స్థాపించారు. మానవులందరికీ దేవుడు ఒక్కడేనని, భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లో ఉన్న దైవజ్ఞానము ఒక్కటేనని, త్రైత సిద్ధాంతం ఇదే చెబుతుందని ప్రబోధానంద తన రచనల ద్వారా చెప్పేవారు. ఆధ్మాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశారు