YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏపి లోఆరోగ్యశ్రీ కిందకు అన్ని కరోనా చికిత్సలు తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ

ఏపి లోఆరోగ్యశ్రీ కిందకు అన్ని కరోనా చికిత్సలు      తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ

హైదరాబాద్ జూలై 9 
తెలుగు రాష్ట్రాలను కరోనా కప్పేస్తోంది. వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఏపీలో ఇప్పటికే అన్ని కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చి ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది  ఏపి ప్రభుత్వం .కాగా తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ కొనసాగుతోంది.తెలంగానలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రోజుకు 1500పైనే కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఏకంగా 1924 పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 30వేలకు చేరింది. బుధవారం ఒక్కరోజే 11 మంది కరోనాతో మృతిచెందడం కలకలం రేపింది. మొత్తం తెలంగాణలో ఇప్పటివరకు 324మంది కరోనాతో చనిపోయారు. జీహెచ్ఎంసీలోనే కేసుల తీవ్రత అధికంగా ఉంది.కరోనా కేసులు పెరుగుతుండడం.. మరణాల సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు తగ్గుతూ మరణాల సంఖ్య పెరగడం మంచి పరిణామం కాదు.. దీనివల్ల ప్రజల్లోనూ ఆందోళన పెరుగుతోంది. కరోనా తీరు వేగంగా మారుతూ మరణాల రేటు పెరగడమే ఇప్పుడు అందరిలోనూ భయాన్ని కలిగిస్తోంది. మొన్నటివరకు లేని ఈ మరణాల రేటు సడన్ గా పెరుగుతుండడం గమనార్హం

Related Posts