కామారెడ్డి జులై 09
కామరెడ్డి మండలం లోని లింగాపూర్ గ్రామంలో గురువారం ఉదయం 7 గంటల నుండి క్షయ నిర్మూలన కోఆర్డినేటర్ శ్యామ్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం లు, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ గ్రామంలో ఇంటిఇంటికి తిరిగి ఎవరైన దగ్గు, కపం తో బాధపడేవారు ఉంటే గుర్తించి పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో పరీక్షలు చేసి, ఒక వేళ నిర్ధారణ అయితే చికిత్స అందించి వ్యాధిని నయం చేస్తాం అని పేర్కొన్నారు. పూర్తిగా నిర్మూలన అవుతుంది అని ఎటువంటి భయం అవసరం లేదు అని పేర్కొన్నారు. ఈ ఇంటింటి సర్వే లో ఏఎన్ఎం కవిత, ఆసియా సుల్తానా, అంగన్వాడీ టీచర్స్ ఉమారాణి, ఆశావర్కర్లు జ్యోతి, లక్ష్మీ, అనురాధ, మల్లీశ్వరి ,కో ఆర్డినటర్ శ్యామ్ పాల్గొన్నారు.