నిజామాబాద్, జులై 10
నగర మేయర్ దండు నీతూ కిరణ్ శుక్రవారం నగరంలో పలు ప్రాంతాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈమేరకు 35వ డివిజన్ నాందేవ్ వాడలో, 2వ డివిజన్ దాస్ నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో, బోధన్ రోడ్డులోని ఈద్ఘాలో మేయర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్ జితేష్.వి. పాటిల్, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, రాయ్ సింగ్, ఈద్ఘా కమిటి సభ్యులు, మున్సిపల్ ఇంజినీర్ ఆనంద్ సాగర్, ఏఈ లు శంకర్, కొండల్ రావు, డిప్యూటీ ఈ ఈ ముస్తాక్ అహ్మద్, టీఆర్ ఎస్ నాయకులు తారీక్ అన్సారీ, ఫయీమ్ ఖురేషీ, అలీం, సునీల్ ఇతర సిబ్బంది పాల్గోన్నారు.