కరీంనగర్ జులై 10
ముఖ్యమంత్రి కేసిఆర్ కోరిక మేరకు నగరంలో మాడ్రన్ పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ అభివృద్దిలో భాగంగా ఈ రోజు అంభేడ్కర్ స్టేడియం వద్ద భగత్ సింగ్ విగ్రహా సమీపంలో నగరపాలక సంస్థ ఆద్వర్యంలో మాడ్రన్ పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం కోసం మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కే.శశాంక, మేయర్ సునిల్ రావు, కమీషనర్ క్రాంతిలు శంఖుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ... నగర ప్రజలకు సరికొత్త డిజైన్ తో మరుగు దొడ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఈ రోజు 15 మాడ్రన్ మరుగు దొడ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు. సుంధర మైన మరుగు దొడ్లు నిర్మించి... నగర ప్రజలకు ముఖ్యంగ మహిళలకు సౌకర్యం కల్పిస్తామన్నారు. నూతన పద్దతిలో చేపట్టే మరుగు దొడ్లలో పరిశుభ్రతను పాటించి ఎలాంటి దర్గందం వెదజల్లకుండ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నగర వ్యాప్తంగా వివిద ప్రదేశాల్లో మొత్తం 105 ప్రజా మరుగు దొడ్లలో మహిళలకు, పురుషులకు అనువుగా ఉండే విధంగ విటీని నిర్మిస్తామని తెలిపారు. మొదటి దశ కింద 15 మరుగు దొడ్లను ఆగస్టు 15 వ తేది లోగా... నెలలోపు పూర్తి చేసి... ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండ మాడ్రన్ ప్రజా మరుగుదొడ్ల నిర్మాణంలో మహిళలకు, పురుషులకు, వికలాంగులకు అనువుగా ఉండే విధంగా... చిన్న పిల్లలు ఉన్న తల్లులు సేద తీరే విధంగా...గదుల రూపంలో నిర్మించి వసతులు మరియు సరైన నీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి మరుగు దొడ్ల నిర్మాణం అవసర మున్న నిర్మించేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి తెలిపారు. గతంలో నిర్మించిన ప్రజా మరుగు దొడ్లు అపరిశుభ్రతతో ఉండేవి... ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండ హైటెక్ నగరాలలో ఉన్న మాదిరిగా నిత్యం పరిశుభ్రంగా ఉండే విధంగా మాడ్రన్ ప్రజా మరుగు దొడ్లను నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఒడితల సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఏనుగు రవీంధర్ రెడ్డి, మాజీ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్, పలువు కార్పోరేటర్లు, నగరపాలక సంస్థ ఈఈ రామన్, ఏఈ వెంకట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.