YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వేగంగా భద్రంగా మీకు చేరువలో ఆర్ టీ సి నినాదం ---గంగాధర బస్టాండ్ లో ఆర్ టీ సి కార్గో కొరియర్ సేవలు ప్రారంభించిన ఆర్ ఎం

వేగంగా భద్రంగా మీకు చేరువలో ఆర్ టీ సి నినాదం  ---గంగాధర బస్టాండ్ లో ఆర్ టీ సి కార్గో కొరియర్ సేవలు ప్రారంభించిన ఆర్ ఎం

చొప్పదండి జూలై 10 
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ క్రాస్ రోడ్డులో గల ఆర్ టీ సి బస్టాండ్ లో ఆర్ టీ సి కార్గో కొరియర్ సేవలను తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ రీజనల్ మేనేజర్ పబ్బ జీవన్ ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి శుక్రవారం ప్రారంభం చేసారు. అనంతరం గంగాధర లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో బస్టాండ్ ఆవరణలో పలువురు ఆర్ టీ సి అధికారులు గంగాధర మండల లయన్స్ క్లబ్ సబ్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్ టీ సి ఆర్ ఎం పబ్బ జీవన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్ టీ సి కార్మికుల సమ్మె తర్వాత ప్రజలకు వ్యాపారస్తులకు కోరియర్ సర్వీసులను ఆర్ టీ సి బస్సుల ద్వారా అందించి వానిజ్యపరంగా పెంచాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం జూన్ 19 నుండి రాష్ట్రంలో 140 బస్ స్టేషన్ ల నుండి కరీంనగర్ జిల్లాలో పది బస్ డిపోలున్నాయని అందులో 12 బస్ స్టేషన్ ల నుండి కార్గో కొరియర్ బుకింగ్ సర్వీసులను ప్రారంభం చేసామని అన్నారు.త్వరలో ఎల్కతుర్తి, ఎల్లారెడ్డి పేటలో కార్గో కొరియర్ పార్శిల్ బుకింగ్ కార్యాలయాలు ప్రారంభం చేస్తామని అన్నారు. వేగంగా భద్రంగా మీకు చేరువలో అనే నినాదంతో కార్గో సేవలు ప్రారంభిస్తున్నామని సామానులను పూర్తి భద్రత ఆర్ టీ సి కార్మికులు చాస్తారని ప్రైవేట్ కార్గో సర్వీసుల కంటే 50%  తక్కువ రేట్లతోనే సకాలంలో భద్రంగా సర్వీసులను అందిస్తున్నామని అన్నారు. మార్గమధ్యంలో టోల్ గేట్లు ఉంటే అదనపు చార్జీలుంటాయని ప్రతి 240 కిలోమీటర్ల పైన ప్రతి కిలో మీటర్ కు 37 రూపాయలు మరియు 5 శాతం జీ ఎస్ టీ ఉంటుందని తెలియ చేసారు. చిన్న గుండు సూది మొదలు కోని పెద్ద పార్శిల్ల వరకు తీసికొని వెల్తామని అలాగే ఇల్లు షిప్ట్ చేసినప్పటికి కార్గో సేవలు వినియోగించుకోవచ్చని కాని హమాలిలను చూసుకోవాలని ప్రస్తుతం హమాలి కొరత ఉందని అన్నారు. ఆర్ టీ సి సంస్థ ఆద్వర్యంలో అధికృత బుకింగ్ ఏజంట్లను నియమించి వినియోగ దారులకు ఇంటి నుండే సేవలందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్ టీ సి కార్గో సేవలు వినియోగించుకావలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ టీ సి డి ఎం మల్లేశం, ఏ బి ఎం జోత్స్న పలువురు ఆర్ టీ సి అధికారులు మధురానగర్ సర్పంచ్ వేముల లావణ్య, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు వేముల అంజి,లయన్స్ క్లబ్ జడ్ ఎం లక్ష్మారెడ్డి, డిసిఎం డా. వడ్లకొండ రవీందర్, మండల అధ్యక్షుడు ఎర్రం లక్ష్మన్, ఇప్పలపెల్లి శంకరయ్య, పలువురు లయన్స్ క్లబ్ సబ్యులు, ఆర్ టీ సి కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు

Related Posts