ఏలూరు, జులై 11
రాష్ట్రంలో వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం ప్రతికోలలంక గ్రామంలో నాలుగు రోజుల నుండి వర్షం భారీగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రతి కోలలంక గ్రామవాసులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇల్లు నీట మునిగాయి. రోడ్లన్నీ కూడా జలమయమై మోకాలు లోతు నీటిలో ప్రజల జీవనం కష్టంగా మారింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్థంభించింది. ఎక్కడికక్కడ ప్రజలు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే కొన్నిచోట్ల అయితే ఇళ్లల్లోకి నీరు పోయి ప్రజలు తీవ్ర అవస్థకు లోనౌతున్నారు. కొంచంకూడా తెరపి ఇవ్వకుండా కురుస్తోన్న వర్షం కారణంగా నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్లు, వాగులు, వంకలు అన్నింటిలోకి నీరు చేరుకున్నాయి.