YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బిగ్ బీ మనవడి తెరంగేట్రం

బిగ్ బీ మనవడి తెరంగేట్రం

ఆలిండియా సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం నుంచి వస్తున్న మరో జనరేషన్ కుర్రాడు నందా. అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేత బచ్చన్ నందా కుమారుడే ఈ అగస్త్య నందా.. చిన్పప్పటి నుంచే అతనికి సినిమాలంటే బాగా ఇంట్రస్ట్. తాత, అమ్మ్మమ్మ, మేనమామ, అత్తలను చూస్తూ పెరిగిన పిల్లాడు కనుక సహజంగానే వెండితెరపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇప్పుడు హీరోగా రావడానికి తయారుగా వున్నాడు.
అమితాబ్ బచ్చన్ కుటుంబంలో దాదాపు అందరూ నటులే. బిగ్ బీ సతీమణి జయా గొప్పనటీమణి. అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్.. కోడలు ఐశ్వర్యరాయ్ నటులుగా రాణించారు. ఇప్పడు అగస్త్య నందా హీరోగా మారబోతున్నాడు.
సోషల్మీడియాలో అగస్త్య నందాకు ఇప్పటికే సూపర్ ఫాలోయింగ్ ఉంది. పైగా బిగ్ బీ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావడంతో అవకాశాలు వరస కడుతున్నాయి. ప్రస్తుతం అగస్త్య సినిమా కథలు వింటున్నాడని సమాచారం. ఏదైనా స్టోరీ నచ్చితే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అగస్త్య నందా సోదరి నవ్య నవేలీ నందా కుడా  మోడల్గా రాణిస్తోంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవలు అందించేందుకు ఒక ఆర్గనైజేషన్ కూడా ప్రారంభించింది.

Related Posts