కర్నూలు జూలై 11,
కర్నూలు జిల్లా ఆదోని మండలం లో పాండవగల్లు సమీపంలోని ఏడు గ్రామాలకు తాగునీటి సమస్య పీడిస్తోంది. పాండవగల్లు లోని ఎస్ఎస్ ట్యాంకు నుంచి ఈ గ్రామాలకు నీరు సరఫరా అవుతున్నాయి. రెండు నెలల క్రితమే ఎస్ఎస్ ట్యాంక్ కు గండి పడి నీరు వృధా గా మారాయి. పంబంధిత అధికారులకు చెప్పినా చూసి చూడనట్టు ఉంటున్నారని గ్రామస్థుల ఆరోపణ. ఎస్ఎస్ టెంక్ కు మరమ్మతులు చేయలేదని అంటున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యం వల్లే మా గ్రామాలకు తాగునీటి సమస్య వచ్చిందని, కనీసం ఊర్లో బోర్లు కూడా లేవని తాగడానికి మంచినీరు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని వాపోతున్నారు. ఈ నేపధ్యంలో శనివారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.