YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పరీక్షలు రద్దు చేయాలి

పరీక్షలు రద్దు చేయాలి

విజయవాడ జూలై 11, 
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఏపీలో ప్రతిరోజూ వెయ్యికిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అంటే సాధ్యం కాని విషయమని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయడం సంతోషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే విద్యా సంస్థల్లో , యూనివర్సిటీ లలో   మిగిలిన పరీక్షలను కూడా రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలి. కరోనా వైరస్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే కార్పొరేట్ కాలేజీలు మాత్రం తల్లిదండ్రుల ఆశలతో అడుకుంటున్నాయి. పుస్తకాలు, యూనిఫామ్ , ఆన్ లైన్ క్లాసులు పేరుతో తల్లిదండ్రుల నుంచి ఫీజులు దండుకుంటున్నారు. పనులు లేక పస్తులు ఉంటుంటే వేలకు వేలు ఆన్ లైన్ క్లాసులకు ఫీజులు ఎక్కడి నుంచి కడతారని ఆమె ప్రశ్నించారు.  కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేదించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

Related Posts