విజయవాడ జూలై 11,
ఇంద్రకీలాద్రిపై అవినీతి ఆరోపణలు రోజు కి పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అవినీతి పై చర్యలు తీసుకోవటం లేదు. అర్హత లేని ఈవో సురేష్ ని ఎలా కొనసాగిస్తారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. మంత్రి బినామీ గా ఉండి, అవినీతి లో వాటా వెల్లంపల్లి కి వెళ్తుంది కాబట్టి ఈవో సురేష్ ని కొనసాగిస్తున్నారు. అవినీతి అనకొండ దుర్గ గుడి ఈవో సురేష్. ఆడిట్ రిపోర్ట్ ని పరిశీలించకుండా కోట్ల రూపాయల బిల్స్ లను అప్రూవ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణల పై ఎందుకు కమిషనర్ కార్యాలయం తనిఖీ చేయటం లేదు. అడిషనల్ లిఫ్ట్స్ పేరుతో ఆల్రెడీ కట్టిన లిఫ్ట్ లకు 2 కోట్ల 30 లక్షల బిల్స్ పెట్టుకున్నారు. కట్టిన లిఫ్ట్ కి 2 కోట్ల 30 లక్షల బిల్స్ ఎలా చెల్లింపు లు చేస్తారని నిలదీసారు. కుమ్మరి పాలెం నుండి అర్జున్ వీడి వరకు ఫుట్ పాత్ 10 లక్షల బిల్స్ పెట్టారు. ఫుట్ పాత్ నిర్మాణం కి దుర్గ గుడికి ఏమి సంబంధం..అది విఎంసి పరిధి లోనిది. మహా మండపం నిర్మాణం పూర్తి అయి 4 ఏళ్ళు అయింది.. అది దుర్గ గుడి ఇంకా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని అయన ప్రశ్నించారు.
మహా మండపం పూర్తి అయినా ఏదో ఒక పని అంటూ మరలా పనులు చేసి బిల్స్ పెట్టుకుంటున్నారు. వేస్ట్ జ్ ట్యాంక్ పేరుతో 60 లక్షలకు బిల్ పెట్టుకున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయలు అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అక్రమంగా తొలగించారు. ఈవో చెప్పిన అవినీతి పనులు చేయనందుకే ఉద్యోగులను తొలగించారు. ఈవో కి అత్యంత సన్నిహితురాలును అందలం ఎక్కించారు. కాశీ విశ్వేశర స్వామి దేవాలయానికి చెందిన 900 గజాల 10 కోట్ల విలువైన భూములో కాంప్లెక్స్ నిర్మాణము చేస్తున్నారు. ఈ విషయం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు కి కనపడటం లేదా. కృష్ణా జిల్లా ఇంచార్జి మంత్రి పెద్ది రెడ్డి అభివృద్ధి కి ఇంచార్జ్ నా... అవినీతి కి ఇంచార్జ్ నా...? దుర్గ గుడి పాలక మండలి కి అక్కడ జరిగే అవినీతి తెలియదా. ఈవో సురేష్ ఇస్తున్న పచ్చ నోట్ల ప్రసాదాన్ని పాలకమండలి ఆరగిస్తుందా. చైర్మన్ కి సైతం అవినీతి లో వాటా ఉందా అయన ప్రశ్నించారు