రంగస్థలం"లో రామలక్ష్మిగా సమంత, కుమార్ బాబు గా ఆది పినిశెట్టి విశేషమైన రీతిలో అశేష ప్రేక్షకలోకాన్ని మైమరపించిన తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం "యు టర్స్". కన్నడలో ఘన విజయం సొంతం చేసుకొన్న "యు టర్న్" చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మొదలైంది. తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా.. కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి మాట్లాడుతూ.. "ఒక ఫ్లై ఓవర్ మీద చనిపోతున్న మోటార్ సైకిల్ రైడర్ల కేస్ ను ఛేదించే ఓ జర్నలిస్ట్ కథే "యు టర్న్". సమంత ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా నటిస్తోంది. ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. భాషా బేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించదగ్గ కథ "యు టర్న్". ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ షూటింగ్ గత నెల మొదలైంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ ముగిసింది. ఇప్పుడు సెకండ్ హైద్రాబాద్ లోని బూత్ బంగ్లాలో వేసిన భారీ సెట్ లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. కన్నడ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. నరేన్, భూమికల పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. ఒరిజినల్ వెర్షన్ కంటే అద్భుతంగా తెలుగు-తమిళ రీమేక్ ను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా తెలుగు-తమిళ నేటివిటీకి తగ్గట్లుగా చేసిన మార్పులు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కుతున్న "యు టర్న్" ప్రేక్షకులను విశేషమైన రీతిలో అలరించడం ఖాయం" అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి, కథ-దర్శకత్వం: పవన్ కుమార్.