విశాఖ జూలై 11
విశాఖలో కలకలం రేపిన జామి సురేశ్ కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో ఇద్దర్నీ అరెష్టు చేసిన పోలీసులు కిడ్నాప్ వెనుక మొత్తం ఏడుగురి హస్తం ఉందని నిర్ధారించారు. జామి సురేష్ ను ఈ నెల 5 న కిడ్నాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారు. అయితే చివరికి 30 లక్షలు కు డీల్ కుదుర్చుకున్నారు. బంగారం బ్యాంక్ లో తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తానని చెప్పి నిందితులను బ్యాంకు కి తీసుకొని వెళ్లిన జామి సురేష్, ఇంతలో పోలీసులకు సమాచారం ఇవ్వడం తో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే జామి సురేష్ ని కార్లో తీసుకొని వెళ్లి దాడి చేసి పరవాడ వద్ద కార్ తో సహా సురేష్ ని విడిచిపెట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసు లో నిందితులు ఏ2 ప్రతాప్ రెడ్డి, బాధితుడి సురేష్ కి పరిచయం ఉంది. అయితే ప్రతాప్ రెడ్డి ఈజీ మనీ కోసం ఏ1 ప్రసాద్ తో కలసి సురేష్ ను కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో కిడ్నాప్ కు ప్రయత్నించి చివరికి సురేష్ ను విడిచి పెట్టి పరారయ్యారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మరోఐదుగురి వ్యక్తుల కోసం గాలిస్తున్నామని సిపీ ఆర్కేమీనా తెలిపారు.