YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ దేశీయం

ఖర్చుల కోసం కారును బేరానికి పెట్టిన భారత క్రీడాకారిణి

ఖర్చుల కోసం కారును బేరానికి పెట్టిన భారత క్రీడాకారిణి

హైదరబాద్ జూలై 11 
మహమ్మారి వైరస్ నేపథ్యంలో క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని రకాల క్రీడాకారులు పోటీలు లేక.. స్పాన్సర్షిప్లు లేక ఆదాయం కోల్పోయారు. ఈ క్రమంలో వారి రోజువారీ ఖర్చులు కూడా తీర్చుకోలేని పరిస్థితి. టాప్ క్రీడాకారులయితే పరిస్థితిని ఎలాగోలా తట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రీడాకారులు మాత్రం తీవ్ర చిక్కుల్లో పడ్డారు. అలాంటి కష్టాలు భరించలేక ఇప్పుడు ఓ క్రీడాకారిణి తన బీఎండబ్ల్యూ కారును విక్రయానికి పెట్టింది. తన శిక్షణ ఖర్చుల కోసం భారతదేశపు అత్యంత వేగవంతమైన మహిళ రన్నర్ ద్యుతీ చంద్ తన బీఎమ్డబ్ల్యూని ఆన్లైన్ లో విక్రయానికి పెట్టడం సంచలనంగా మారింది. అయితే కొద్దిసేపటికి ఆ పోస్ట్ను తొలగించగా అప్పటికే అది వైరల్ గా మారింది. ద్యుతీకి 2015 బీఎమ్డబ్ల్యూ 3-సిరీస్ మోడల్ కారు ఉంది. ఈ కారును ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించడంతో ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ అందించిన రూ.3 కోట్లతో కొన్నది. రూ .30 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం టోక్యో ఒలంపిక్స్ కోసం సాధన చేసేందుకు ఖర్చులకు డబ్బులు లేవు. తన శిక్షణ ఖర్చుల కోసం తన కారును అమ్మడానికి సిద్దమైంది. ''ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఏ స్పాన్సర్ నా కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా లేడు. నాకు డబ్బు అవసరం ఉంది. నేను టోక్యో ఒలింపిక్ కోసం సిద్ధమవుతున్నప్పుడు నా శిక్షణ.. ఆహార ఖర్చుల కోసం దానిని అమ్మాలని నిర్ణయించుకున్నా`` అని ద్యుతీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.  ఈ పోస్టు చేసిన కొద్దిసేపటికే అందరికీ తెలిసింది. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ పోస్ట్ చేసిన తరువాత ఆమెకు సహాయం చేయడానికి ప్రభుత్వ ముందుకు రావడంతో ఆ పోస్ట్ ను తీసేసినట్లు సమాచారం. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ఆమె శిక్షణ పొందుతోంది. దీనికోసం ఒరిస్సా ప్రభుత్వం రూ .50 లక్షలు మంజూరు చేసింది. కోచ్ ఫిజియోథెరపిస్ట్స్ డైటీషియన్ జీతాలతో సహా ఆమె శిక్షణ కోసం నెలకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.

Related Posts