YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కలకలం రేపిన కుల బహిష్కరణ

కలకలం రేపిన కుల బహిష్కరణ

ఏలూరు జూలై 11 
ఒక కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రజలందరిని చిదిమేస్తూ ఉంటే పలు కుటుంబాలను సాంఘిక బహిష్కరణ కు గురి చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం చినమల్లం గ్రామంలో చోటుచేసుకుంది.చినమల్లం గ్రామానికి చెందిన కొంతమంది ఎస్సి సామాజిక వర్గానికి చెందిన సంఘ పెద్దలు అదే గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలను సాంఘిక బహిష్కరణ కు గురిచేశారు.గత టిడిపి ప్రభుత్వ హయాంలో సరెళ్ల సుధాకర్ అనే వ్యక్తికి ఇంటి స్థలం మంజూరైందని ఆ విషయంలో సంఘ పెద్దలు మోసపురితంగా వ్యవహరించి ఆ స్థలం రాకుండా అడ్డుకున్నారని అన్నారు.ఇలా మరో మూడు కుటుంబాలైన కోలాటి నరసింహ మూర్తి,కోరుకొండ రామమోహన్ రావు ,సరెళ్ళ దుర్గాప్రసాద్ కుటుంబాలను వివిధ కారణాలతో వెలివేసినట్లు బాధితులు తెలిపారు.సరిపల్లి అరుణకుమారి గత నాలుగేళ్లుగా ఆశా వర్కర్ గా పనిచేస్తుంది.ఈ తరుణంలో ఆమెపై కొందరు వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారని అధికారులు పరిశీలించి ఆమె నిర్వహిస్తున్న విధుల్లో ఎటువంటి లోపాలు లేవని తేల్చిచెప్పారు. అదే విషయం పై ఆమెపై కక్ష పురితమైన ధోరణితో అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ గ్రామ కమిటీ నుంచి సస్పెన్షన్ కు గురైన సాదే హనుమంతరావు అమెను మానసికంగా వేధింపులకు గురి చేస్తూ నువ్వు నాకు రోజు నమస్కరించి వెళ్లకపోతే నీ అంతు చూస్తా అని బెదిరుస్తున్నాడని ఆమె వాపోయింది.చిన్నారులు సైతం ఆడుకోవడానికి వెళితే మిమ్మల్ని వెలివేసారని అంటున్నారని పిల్లలు మమ్మల్ని వెలి అంటే ఏంటని అడుగుతున్నారని ,ఇదే విషయాన్ని స్థానిక న్యాయవాది వద్దకు ఫిర్యాదు చేశామని న్యాయవాది ఆయనను తీవ్రంగా మండలించడంతో హనుమంతరావు మరింత కక్ష పెంచుకుని తన అనుచరులతో ప్రతి రోజూ మరింత వేదింపులకు గురి చేసేవాడని ఆమె వాపోయింది.ఈ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని ఎవరైనా మాట్లాడితే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలని ప్రకటించారని బాధితులు వాపోయారు.ఈ కుటుంబాలకు కిరాణా షాపుల్లో సరుకులు కూడా అమ్మకుండా బంద్ చేసారని,కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వని పరిస్థితి నెల రోజులుగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు.దీనిపై స్థానిక అధికారులు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
 

Related Posts