YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మంత్రాలయంలో పూర్తిగా లాక్ డౌన్

మంత్రాలయంలో  పూర్తిగా  లాక్ డౌన్

మంత్రాలయం జూలై 12
మంత్రాలయం మండలం లోని కరోనా వ్యాధి విజృంబిస్తున్న నేపథ్యంలో మంత్రాలయంలో ఆదివారం నుంచిపూర్తిగా  లాక్ డౌన్ విధిస్తున్నట్లు తహసీల్దార్ చంద్ర శేఖర్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీఐ కృష్ణయ్య, ఈవోపీఆర్డి నాగేష్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కర్నాటక రాష్ట్రం నుంచి యువతి, యువకులు ఎక్కువగా వస్తున్నారని రాయచూరు ప్రాంతంలో కేసులు ఎక్కువగా ఉన్నందున వారిని కూడా మంత్రాలయం లోకి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చర్చించారు. ఆదివారం నుంచి ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలకు, హోటల్ లకు అనుమతి ఉందన్నారు. 11 గంటల తర్వాత ఎవ్వరైనా బయటకు వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఐ ని కోరారు. అత్యవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రాకూడదని దీనికి తోడు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ బంక్ లు కూడా బంద్ పాటించాలని సూచించారు. ఆదివారం నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో  రెవెన్యూ ఇన్ స్పెక్టర్ మహేష్, మాజీ సర్పంచ్ టి. భీమయ్య, నాయకులు మల్లికార్జున, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts