YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల రోజుల్లో స్వామి వారికి 15 కోట్లు

నెల రోజుల్లో స్వామి వారికి 15 కోట్లు

తిరుమల, జూలై 12
లాక్‌డౌన్ తర్వాత తిరుమలలో భక్తుల్ని దర్శనానికి అనుమతించి నెల రోజులు పూర్తవుతోంది. జూన్ 11 నుంచి ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు నెల రోజుల్లో శ్రీవారిని 2,63,000 మంది భక్తులు దర్శించుకున్నారు. జూన్ 11 నుంచి జూలై 10 వరకు హుండీ ద్వారా రూ.15 కోట్ల 80 లక్షలు ఆదాయం వచ్చింది. లక్షమంది పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఆన్‌లైన్ ద్వారా దర్శనానికి టికెట్లు కేటాయిస్తున్నారు. రోజుకు ఆరు, ఏడు వేలమందికి మాత్రమే స్లాట్లు కేటాయిస్తున్నారు. అద్దె గదులు కూడా ఆన్‌లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు.మరోవైపు కరోనా వైరస్ నివారణకు టీటీడీ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. భక్తులు దర్శనానికి వెళ్లే క్యూలైన్లలో భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి చేసింది. క్యూ లైన్‌లో శానిటైజర్లు, లిక్విడ్ ఓజోన్ స్ప్రే ఏర్పాటు చేశారు. ఉద్యోగులలో కరోనా కేసులు నమోదు కావడంతో మరింత జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. రెండువారాలకు ఓసారి షిఫ్ట్ విధానం ప్రవేశ పెట్టారు. భక్తులకు కూడా అలిపి దగ్గరే థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాగే ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నారు

Related Posts