YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కషాయంతో కరోనా పరార్

కషాయంతో కరోనా పరార్

హైద్రాబాద్, జూలై 12,
 నెల మొదట్లో కరోనా సోకినట్లు గుర్తించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కోలుకొని డిశ్చార్జి అయ్యారు. యశోద ఆస్పత్రిలో ఆమె దాదాపు 9 రోజుల పాటు చికిత్స పొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నానని, ఈ క్రమంలోనే కరోనా సోకినట్లు వివరించారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సందర్భంగా గొంగిడి సునీత విలేకరులతో మాట్లాడారు. అందరూ అనుకుంటున్నట్లు కరోనా లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయనుకోవడం పొరపాటని చెప్పారు. గత నెల 28న తనకు బాగా ఒళ్లు నొప్పులు ఉన్నాయని, అంతేకానీ మరే ఇతర లక్షణాలు లేవని వివరించారు.కరోనా పాజిటివ్ అని తేలాక ఆస్పత్రిలో చేరి వైద్యుల సూచన మేరకు మందులను వాడినట్లు వివరించారు. తాను సొంతగా విద్యుత్‌తో పని చేసే కెటిల్ కొనుక్కొని ఆస్పత్రిలోనే కషాయం తయారు చేసుకొని తాగినట్లు వివరించారు. ఈ పరిస్థితుల్లో ధైర్యం చాలా అవసరమని వివరించారు. తాము త్వరగా కోలుకోవడం కోసం నియోజకవర్గ ప్రజలు ప్రార్థనలు చేశారని, వారి ఆశీస్సుల వల్లే త్వరగా కోలుకున్నట్లు వివరించారు.జూలై 2న తనకు కరోనా ఉన్నట్లు తేలిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత వెల్లడించారు. వెంటనే యశోదా ఆస్పత్రిలో చేరనని వివరించారు. తనతోపాటు భర్త మహేందర్ రెడ్డి కూడా కరోనా లక్షణాలతో అదే చేరినట్లు వివరించారు. గతంలో క్షయ వ్యాధిలాగా ఇప్పుడు కరోనా వ్యాధి ప్రబలుతోందని, అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గుండెజబ్బులు, డయాలసిస్, మూత్రపిండ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సునీత వివరించారు. కరోనా సోకితే తాను కొన్ని జాగ్రత్తలు పాటించినట్లు చెప్పారు. అల్లం, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు నీళ్లలో వేసుకొని మరగబెట్టి తాగానని చెప్పారు. అంతేకాక, రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల చాలా ఉపశమనం ఉంటుందని చెప్పారు

Related Posts