YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కరోనాపై దూకుడు

కరోనాపై దూకుడు

విజయవాడ, జూలై 13, 
ప్రపంచ మహమ్మారిపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న పోరాటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అనేక ధనిక రాష్ట్రాలు చేయలేని పనిని ప్రజారోగ్యం, సమాజ భద్రత కోసం జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటికే కరోనా కట్టడి కోసం అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లను ఏపీ బ్లాక్ చేసి పరీక్షల్లో నెగిటివ్ వచ్చినవారికి మాత్రమే అనుమతి ఇస్తుంది. లేదా ఈ పాస్ విధానం లో వచ్చిన వారిపై గ్రామవాలంటీర్ల ద్వారా నిఘా ఉంచింది. విదేశాలనుంచి వచ్చే వారు, స్వదేశంలోని వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే వారిని ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ పాజిటివ్ కేసులను గుర్తిస్తుంది.అంతే కాదు టెస్ట్ లలో దేశంలో రెండో స్థానంలో కొనసాగుతూ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి రెడీ అయిపొయింది. ఇక అంబులెన్స్ సౌకర్యం కూడా ఎపి వాసులకు అందుబాటులో ఉన్నంతగా దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రానికి లేవు. క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు, ఇతర వైద్య సౌకర్యాలపై సీరియస్ గానే ఫోకస్ పెంచింది వైసిపి సర్కార్. ఇలా కరోనా పై అన్ని రకాల జాగ్రత్తలు వహిస్తూనే రాబోయే ఉపద్రవం ఎలా ఉండబోతుందో ఉహించి తదనుగుణమైన చర్యలు ఇప్పటినుంచి చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది సర్కార్.కరోనా వస్తే ఎలాంటి భయాందోళనలు చెందకుండా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకునేందుకు సైతం ప్రజలను సమాయత్తం చేస్తుంది ప్రభుత్వం. దీనికోసం వైరస్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను, శానిటైజర్, కీలకమైన పల్స్ అక్సోమిటర్, చేతి తొడుగులు, అన్ని కలిపి ఒక కిట్ గా తయారు చేసి అందజేయనున్నారు. ఈ కిట్ లను కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న రోగులకు అందజేస్తారు. ఆక్సిజన్ అందక లేక ఇతర వ్యాధులు సైతం ఉన్నవారు అత్యవసర వైద్యం అందాలిసిన వారిని మాత్రం ఆసుపత్రికి తరలిస్తారు. కరోనా వచ్చాక రోగులు ఈ మందుల కోసం హైరానా పడకుండా సమాజంలో సంచరించకుండా ఇంటివద్దే వైద్యం చేసుకుని త్వరగా కోలుకునే వ్యవస్థ ఏపీలో ప్రవేశపెట్టనుండటం విశేషం. వచ్చే నెలల్లో మహమ్మారి భారత్ లో మరింత విజృంభిస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆ పరిస్థితిని ముందుగా అంచనా వేసి ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ చర్యలు ఇప్పటినుంచి తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

Related Posts