YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విమ్స్ ప్రైవేటీకరించోద్దని ఆందోళన

విమ్స్ ప్రైవేటీకరించోద్దని ఆందోళన

విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరోసారి వార్తల్లోకెక్కింది. విమ్స్‌ను ప్రైవేటుపరం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో విమ్స్ మరోసారి వివాదాస్పదమైంది.రాష్ట్ర ప్రభుత్వం విమ్స్‌ను ప్రవేటికరణ చేయడం కోసమే రెండవ దశ నిధులు కేటాయించలేదు. కార్పోరేట్‌ సంస్థలకు విమ్స్‌ అప్పగించడానికే ఈ పిపిపి పథకం అన్నారు. ప్రభుత్వమే నిధులుకేటాయించాలని, జివో 33ని ఉపసంహారిచాలని కోరుతున్నారు. నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చుచేసి అనేక ఈవెంట్స్‌ చేస్తున్నారు, కోటిమంది ఉన్న ఉత్తరాంధ్రకు సూపర్‌ స్పెషాలిటీ అసుపత్రి ఏర్పాటు చేయలేకపోతున్నారని విమర్శించారు. ఉన్న అసుపత్రికి నిధులు కేటాయించలేకపోతున్నారు. ఉత్తరాంధ్రలో పేదప్రజలు ఎక్కువ మంది ఉన్నారని గుర్తుచేశారు. వీరు లక్షలు పోసి వైధ్యం చేయించుకోలేరన్నారు. పిపిపి కింద వచ్చే వైద్యసేవలకు తప్పనిసరిగ ఫీ˜ిజులు చెల్లించాలి తెలిపారు. ఇప్పటికే యూజర్‌ ఛార్జీలు పేరుతో విమ్స్‌ ప్రతి చికిత్సకి వివిధ రూపాలలో ఫీజులు వసుళ్ళు చేస్తున్నారని తెఇపారు. విమ్స్‌ను దశలవారీగా ప్రైవేటీకరించటానికి రాష్ట్ర ప్రభుత్వం జిఒ 33ని విడుదలచేసింది  విమ్స్ ఆరంభం నుంచి బాలారిష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో వైద్య సేవలను అందించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విమ్స్‌లో అన్ని సేవలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద చేపట్టడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పార్టీలూ  విమ్స్ వద్ద ఆందోళనకు దిగనున్నాయి.విమ్స్‌లో ఎనిమిది రకాల వ్యాధులకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నారు. ఈ వ్యాధులన్నింటినీ ఎన్టీఆర్ వైద్య పరిధిలోకి తీసుకువస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు, ఎంప్లాయి హెల్త్ స్కీమ్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ కార్డులు ఉన్న వారందరికీ ఈ సేవలు అందించనున్నారు. సాధారణ వ్యక్తులకు అతి తక్కువ ధరకు ఈ సేవలు అందించనున్నారు. వివిధ సర్జరీలకు, పరీక్షలకు సంబంధించిన పరికరాలను, యంత్రాలను ప్రైవేటు వ్యక్తులే కొనుగోలు చేసి విమ్స్‌లో అమర్చుతారు. వారు రోగుల నుంచి కొంత రుసుము వసూలు చేస్తారు. దీంతోపాటు, ఆయా రోగులకు ఉన్న కార్డుల మీద వచ్చే మొత్తాన్ని కూడా ప్రభుత్వం నుంచి రాబడతారు. దీనివలన అటు ప్రభుత్వం, ఇటు రోగి నుంచి కూడా డబ్బులు రాబట్టే అవకాశం ఉందని చెపుతున్నారు.విమ్స్‌ను ప్రైవేటుపరం చేయడానికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు ఆగలేదని తెలుస్తోంది. పీపీపీ విధానాన్ని ముందు ప్రవేశపెట్టి, నెమ్మదిగా విమ్స్‌ను ప్రైవేటుపరం చేస్తారన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు  విమ్స్ వద్ద ఆందోళన చేపట్టనున్నాయి

Related Posts