YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘరామరాజు చర్యలు..తీసుకుంటారా..

రఘరామరాజు చర్యలు..తీసుకుంటారా..

ఏలూరు, జూలై 13, 
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కాలుమోపేందుకు అవకాశం లేదు. జనసేనతో జత కలసినా ఎంపీ సీట్లకు వచ్చే సరికి ఎన్ని దక్కుతాయో క్లారిటీ లేని పరిస్థితి బీజేపీది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. ఇందుకోసం బయటకు విమర్శలు చేస్తున్నా లోలోపల వైసీపీతో బీజేపీ అనుబంధం కొనసాగిస్తుందన్నది విశ్లేషకుల అంచనా. బీజేపీకి ఏపీలో అంతకు మించి మార్గం మరొకటి లేదు.అయితే బీజేపీ, వైసీపీ బంధం ఎలా ఉందన్న విషయం త్వరలోనే బయటపడనుంది. ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనేక అంశాల్లో వైసీపీ బహిరంగంగా మద్దతు మద్దతు తెలిపింది. బీజేపీ కేంద్రం పెద్దలు సయితం జగన్ పట్ల కొంత సానుకూలంగానే వెళుతున్నారు. ఏపీ రాజధాని మార్పు విషయంలో రాష్ట్ర నేతలు తప్పుపడుతున్నా కేంద్రంపెద్దలు పెద్దగా పట్టించుకోలేదు.ఇక శాసనమండలిని జగన్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిపాదనలను పెండింగ్ లో ఉండటంతో ఏపీ శాసనమండలిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు ప్రతిపాదనల విషయంలో బీజేపీ వైసీపీకి సానుకూలంగా వ్యవహరించలేదు. అయినా దీనిని పెద్దగా వైసీపీ కూడా పట్టించుకోలేదు.కానీ ఇప్పుడు మరో అంశంలో మాత్రం బీజేపీ, వైసీపీ మధ్య ఫ్రెండ్ షిప్ తేలిపోనుంది. రఘురామకృష్ణంరాజు అనర్హత పిటీషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అనర్హత పిటీషన్ స్పీకర్ పరిధిలో ఉన్నప్పటికీ ఆయన కూడా బీజేపీ నేత అన్నది వాస్తవం. గతంలో సుమిత్ర మహాజన్ స్పీకర్ గా ఉన్న సమయంలో అప్పట్లో పార్టీ ఫిరాయించిన ఎస్పీవైరెడ్డి, గీతలపై పిటీషన్లు ఇచ్చినా ఐదేళ్లు పెండింగ్ లోనే ఉంచారు. అప్పుడు బీజేపీ, టీడీపీ స్నేహం ఉండేది కావడంతో చర్యలు తీసులేకపోవచ్చు. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటు వేస్తే బీజేపీ వైసీపీకి దగ్గరగానే ఉందని చెప్పాలి. లేదంటే మాత్రం టీడీపీ, వైసీపీలకు సమాన దూరం పాటిస్తుందని చెప్పక తప్పదు.

Related Posts