YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మళ్లీ నిలిచిపోనున్న బెంగళూర్ సర్వీసులు

మళ్లీ నిలిచిపోనున్న బెంగళూర్ సర్వీసులు

విజయవాడ, జూలై 13, 
బెంగళూరుతో పాటూ కర్ణాటక నుంచి బస్సుల్లో రావాలనుకునేవారికి బ్యాడ్‌న్యూస్. ఏపీ-కర్ణాటక మధ్య నడిచే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి సర్వీసులు ఆగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి బెంగళూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నెల 23 వరకు పూర్తిస్థాయిలో నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. అత్యవసర పనుల ఉన్నవారికి మాత్రమే రోడ్లపైకి అనుమతి ఇస్తారు.లాక్‌డౌన్ కారణంతో బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏపీ వైపు సర్వీసులను ఆపేస్తున్నట్లు ఇప్పటికే కర్ణాటక ప్రకటించింది.. ఇక ఏపీ నుంచి వచ్చే బస్సులను అనుమతించే విషయమై దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి బస్సులు తిప్పుతున్నా.. దీనిపై కర్ణాటక అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.అంతేకాదు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. బెంగళూరు నుంచి వస్తున్న వలస కూలీలు, ఇతరులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. కర్ణాటక కూడా ఏపీకి బస్సులు నిలిపివేసింది. దీంతో ఏపీ అధికారులు కూడా ఆలోచనలో పడ్డారు. పరిస్థితిని గమనించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ సర్వీసులు రద్దుకే మొగ్గు చూపితే ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్ల డబ్బు వాపసు చెల్లించనున్నారు.

Related Posts