YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వరంగల్ లో వేడేక్కిన రాజికీయాలు

వరంగల్ లో వేడేక్కిన రాజికీయాలు

వరంగల్ ఆర్బన్ జూలై 13  
సోమవారం నాడు హన్మకొండ అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద హై టెన్షన్ నెలకొంది ఆదివారం నిజమాబాద్ ఎంపీ ధర్మపురి ఆరవింద్ పర్యటన నేపధ్యంలో బీజేపీ, తెరాస శ్రేణుల మధ్య అగ్గి రాజుకున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు ఎలాంటి సంఘటన జరకుండా 100మందితో పోలీసులు భారీ  బందోబస్తు నిర్వహించారు. ఇద్దరు   ఏసీపీలు, పది మంది సీఐలు బందోబస్తులో పాల్గోన్నారు.  ఆదివారం జరిగిన పర్యటనలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్, పై  టిఆర్ఎస్ పార్టీ, వరంగల్ పచ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలపై భూ కబ్జా లు చేస్తున్నారని ఆరోపించారు. అయన చేసిన ఆరోపణలను నిరసిస్తూ టిఆర్ఎస్వీ నాయకులు ఆందోళన కు దిగారు.  జరిగిన సంఘటనను నిరసిస్తూ అమరవీరుల స్తూపం వద్ద రెండు పార్టీలకు చెందిన నాయకులు ఆందోళనలు చేపట్టారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద వచ్చిన బీజేపీ కార్యకర్తలు వచ్చి నిరసనకు దిగారు.  మరోవైపు,  ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టిఆర్ఎస్వీ నాయకులు అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.  బీజేపీ నాయకులు అమరవీరుల స్థూపంవద్ద నిరసన వ్యక్తం చేయడంతో...అపవిత్రత అయ్యిందని   స్థూపాన్ని  టిఆర్ఎస్వీ నాయకులు పాలతో కడిగారు.  రెండు పార్టీలకు చెందిన వారిని సోలీసులు  అరెస్టు చేసారు.

Related Posts