YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కోవిడ్ ప్రభావంతో పెరుగుతున్న నిరుద్యోగులు... ఉపాధి కోల్పోయి తిరిగి వచ్చిన గల్ఫ్ కార్మికులు..

కోవిడ్ ప్రభావంతో పెరుగుతున్న నిరుద్యోగులు... ఉపాధి కోల్పోయి తిరిగి వచ్చిన గల్ఫ్ కార్మికులు..

హైదరాబాద్  
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 కరోనా మహమ్మారితో ప్రజల ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడాలనే సదుద్దేశంంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాలలో గల్ఫ్ లో ఉన్న వారిని తిరిగి రప్పించే చర్యలు చేపట్టారు. అదే విదంగా ఉపాధి కొరకు భారత దేశంలోని మహారాష్ట్ర, పలు రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ ప్రాంతంలోని వారిని స్వగ్రామాలకు తిరిగి రప్పించే ఏర్పాట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో తమ  ప్రాణాలు కాపాడుకోవాలని గల్ఫ్ లో ఉన్న వారు వారు పని చేస్తున్న కంపనీల నుండి పర్మీషన్ లు తీసుకొని చాలా మంది గల్ఫ్ కార్మికులు దుబాయి, కువైట్, సౌది అరేబియా, మస్కట్, పలు దేశాల నుండి తిరిగి వచ్చారు. వారకి క్వారంటైన్ ప్రభుత్వం ఉచితంగా కల్పించకుండా వారి స్వంత ఖర్చులతో క్వారంటైన్ లో ఉండాలని ప్రకటించడంతో చాలా మంది డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే అందులో గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశాలు వెలుతున్న వారుండగా ఇటీవల గల్ఫ్ దేశాలు వెల్లిన వారు కూడా తిరిగి రావడంతో ఇక్కడ చేసిన అప్పులు తీరక మరింత అప్పుల ఊబిలోకి పోయి వారి కుటుంబ బారం బరువుగా మారింది. చాలా మంది కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి గల్ప్ వెల్లిన వారితో పాటుగా మహారాష్ట్ర,గుజరాత్, వంటి ఇతర రాష్ట్రాలకు జీవనోపాధి కొరకు వెల్లినవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇటీవల మహారాష్ట్ర రాష్ట్రంలో కోవిడ్ కేసులు బాగా పెరగడంతో బొంబాయి, బీవండి, పూణే,వంటి పట్టణాలలో ఉన్న వలస కార్మికులు వ్యాపరస్తులు వేలాది మంది తిరిగి స్వగ్రామాలకు వచ్చిన వారు జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలా మంది ఉన్నారు. అయితే వీరి పరిస్థితి ఇక్కడ ఉపాధి లేక ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలకు పోయి వారి భార్య పిల్లలకు దూరంగా కాలం గడుపుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్మ తరుణంలో ఈ మహమ్మారి వ్యాధితో వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. చేతిలో డబ్బులు లేవు ఇక్కడ కనీస ఉపాధి లేదు మళ్లీ జీవనోపాధి కొరకు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలకు పోదమంటే అవకాశం లేక ఉక్కిరిబిక్కిరితో ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ తో హైదరాబాద్ లాంటి మహానగరాలలో ప్రైవేట్ కంపనీలలో షాపింగ్ మాల్స్ లో ఇతరత్రా పనులలో పనిచేసిన వారు కూడా రోడ్డున పడ్జారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ప్రభుత్వాలు ఆదుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మేదావి వర్గం అంటున్నారు. గల్ఫ్ కార్మికులకు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి సేఫ్టీతో పాటుగా కనీస ఉపాధి అవకాశాలు చూపించి ప్రజల ఆకలి బాదలు తీర్చడంతో పాటు జీవనవిధానాలకు వారి కుటుంబాలకు పూర్తి స్థాయి భరోసా ప్రభుత్వం కల్పంచాల్సిన అవసరం ఉంది. కేవలం ఉచితాలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించినపుడే ప్రజలలో ప్రభుత్వాలపైన నమ్మకం ఉంటుంది. కష్టకాలంలో ఉన్నపుడు ఆదుకోవలసింది పాలకులు ప్రజలను పాలించే ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగం.. కాబట్టి ప్రజల జీవన పరిస్థితులను అర్ధం చేసుకోని ప్రత్యేక జీవనోపాధి పథకాలను ప్రవేశ పెట్టి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని పలువురు నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికులు, మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు కోరుతున్నారు.

Related Posts