YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం !

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం !

న్యూ ఢిల్లీ జూలై 13
కరోనా ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఓక చోట భూకంపం వస్తూనే ఉంది. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం తెల్లవారుజామున 2.36 గంటలకు భూకంపం సంభవించింది. డిజ్లీపూర్ కు ఉత్తరాన 153 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రభావం మాగ్నిట్యూడ్ పై 4.3గా నమోదయ్యిందని నేషన్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు తెలిపారు.  జూన్ 28 వతేదీన డిజ్లీపూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. వరుస భూప్రకంపనలతో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వరుసగా భూకంపాలు సంభవించడంతో  అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న  ప్రజలు భయం గుప్పిట్లో ఏ క్షణం లో ఏమవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.ఇకపోతే దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతుంది.  గడిచిన 24 గంటల్లో దేశంలో మళ్లీ అత్యధికంగా 28701 పాజిటివ్ కేసులు నమోదు కాగా 500 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 878254కి చేరుకుంది. మహమ్మారి విజృంభణతో భయంతో వణికిపోతున్న దేశ ప్రజలని వరుస భూకంపాలు మరింతగా భయపెడుతున్నాయి

Related Posts