YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

హోమ్ ఐసోలేషన్ కోరుకునే వారికి మెడికల్ కిట్లు అందించండి - జిల్లా కలెక్టర్

హోమ్ ఐసోలేషన్ కోరుకునే వారికి మెడికల్ కిట్లు అందించండి -  జిల్లా కలెక్టర్

తిరుపతి జూలై 13 
హోమ్ ఐసోలేషన్ కోరుకునే వ్యక్తులకు మెడికల్ కిట్లు అందించి వాడాల్సిన విధానం, ఇంటి వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్లు అర్థం అయ్యేలా వివరించి అనుమతించాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ , జెసి (డి) వీరబ్రహ్మం , అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్  స్థానిక శ్రీనివాసంలో పర్యటించి విధులు నిర్వహిస్తున్న అధికారులకు, డాక్టర్లకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపద్యంలో అధికారులు , డాక్టర్లు మరింత శ్రద్ద వహించాలని వచ్చిన పెషంట్లకు సౌకర్యాలు చూడటం, సమయానికి బోజనం అందించేలా వుండాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్ కు వెల్ల దలచుకున్న వ్యక్తులకు మెడికల్ కిట్ , వాడవలసిన విధానం, ఇంటిలో వున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి పంపాలని, వైద్య బృందం వీరితో రోజుకోక్క సారైనా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్తితి తెలుకుని వుండాలని అన్నారు. అనతరం శ్రీనివాసం ఐదు అంతస్తులలో పర్యటించి ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క అధికారి వుండేలా చూడాలని తెలిపారు. కోవిడ్ భాధితులకు అందిస్తున్న బోజనం రుచి చూసి, సమయం మేరకు అందించాలని సూచించారు. శ్రీనివాసంలో వైద్య సేవలకు సంబంధించిన పరికరాలు, కిట్లు ఎపి ఏం ఐ డి సి , ఈఈ దనంజయ రావు అందించాలని ఆదేశించారు. నేడు మీడియా కోసం ప్రత్యేకంగా మాధవంలో  కోవిడ్ పరీక్షలు ఏర్పాటు చేసినందులకు మీడియా ప్రతినిధులు జిల్లా  కలెక్టరు కు ధన్యవాధాలు తెలిపారు.  కలెక్టర్ పర్యటనలో రుయా సూపర్నెంట్ డా.భారతి , నగరపాలక సంస్థ డి.సి. చంద్రమౌళీశ్వర రెడ్డి, జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల అధికారులు,  కలెక్టరేట్ ఎఒ గోపాలయ్య, డి.టి.లు  సాంబశివరావు , శ్యాంప్రసాద్, ఈశ్వర్, రెవెన్యూ సిబ్బంది  వున్నారు

Related Posts