YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి కంట్లో నలుసుగా రఘురాముడు

వైసీపీకి కంట్లో నలుసుగా రఘురాముడు

ఏలూరు, జూలై 14, 
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇపుడు ఆ పార్టీ హై కమాండ్ కి కంట్లో నలుసుగా మారారు. ఆయన లోక్ సభ సభ్యత్వానికి ఎసరు పెట్టాలని వైసీపీ పెద్దలు అనుకున్నా అది సాధ్యపడుతుందా అన్న సందేహాలు ఇపుడు కలుగుతున్నాయి. అదే సమయంలో రఘురామ కృష్ణం రాజు ఇపుడు వైసీపీలో అసమ్మతిని మరింతగా ఎగదోసే పనిలో పడ్డారని అంటున్నారు. మరి ఆయన ఈ రకంగా చేయడానికి వెనక ఉన్నదెవరో అన్నది తెలియడంలేదు కానీ రాజు గారు తన మీద వైసీపీ హైకమాండ్ కత్తి కట్టినా కూడా ఏ మాత్రం బెదరకుండా అదరకుండా మరింత జోష్, జోరు ప్రదర్శించడంతో పాటు పెద్ద పనినే భుజాన వేసుకున్నారని అంటున్నారు.రఘురామ కృష్ణం రాజు గతంలో ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింహం సింగిల్ గా వస్తుంది అంటూ రజనీకాంత్ సినిమాలోని భారీ డైలాగులు కొట్టారు. అయితే ఆయన సింగిల్ గా కాదు ఇపుడు వైసీపీలో చాలా మంది మిత్రులే ఉన్నారని అంటున్నారు. వారిలో నెల్లూరు పెద్దాయన ముందు భాగాన ఉన్నారని చెబుతున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ హై కమాండ్ మీద ఇప్పటికే అసంత్రుప్తిగా ఉన్నారు. ఆయన వైసీపీ ఏడాది పాలనను ఏమీ కాదని తేల్చేశారు. ఆయన ఇపుడు రఘురామ కృష్ణం రాజుతో తాజాగా సెల్ఫీ దిగడంతో అది వైరల్ అవుతోంది. అలాగే సర్వత్రా చర్చ అవుతోంది.ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఇపుడు వైసీపీలో ఇమడలేకపోతున్నారు. ఆయన అధికారాలకు ఎమ్మెల్యేగా కూడా కోత పెట్టేస్తోంది వైసీపీ. అదే విధంగా ఆయన వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుటుంబానికి చెందిన రాం కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు వ్యూహం రూపొందిస్తోంది. ఈ క్రమంలో పెద్దాయన బయట పడేందుకు చూస్తున్నారు. ఆయన చూపు బీజేపీ మీద ఉందని అంటున్నారు. ఆయన ఇపుడు రఘురామ కృష్ణం రాజుతో కలవడం అంటే ఈ ఇద్దరి దారి కమలం దారేనని అర్ధమవుతోందని అంటున్నారు. ఈ ఇద్దరేనా ఇంకా చాలామంది ఉన్నారా అన్న్ డౌట్లు కూడా ఇపుడు వస్తున్నాయి.ఇక రఘురామ కృష్ణం రాజు బీజేపీలో చేరుతారు అన్నది ఒక ప్రచారంగా ఉంది. ఆయనకు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల సాయం ఉందని కూడా అంటున్నారు. అందుకే ఆయన మీద వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ కూడా పెద్ద సీరియస్ యాక్షన్ కి దారి తీయదు అంటున్నారు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్ వెనక బీజేపీ ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇక రఘురామ కృష్ణం రాజుపై వైసీపీలో అసమ్మతి నేతగా ముద్ర ఉంది. ఆయన పిటిషన్ ని నాన్చుతూ బీజేపీ వైసీపీలో అసమ్మతివాదులను కూడగట్టే బాధ్యత ఏదైనా అప్పగించిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఓ వైపు జగన్ మాత్రం పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇప్పటికీ అందుబాటులోకి రాకుండా ఉంటున్నారు. తన పనేదో తానేంటో అన్నట్లుగా ఉంటున్నారు. ఇపుడు ఆనం మరో అడుగు ముందుకేయడంతో ఉత్తరాంధ్రాకు చెందిన మాజీ మంత్రి తో పాటు పలువురు ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా తమ గళం మళ్లీ గట్టిగా వినిపించే చాన్స్ ఉంది అంటున్నారు, చూడాలి ఏం జరుగుతుందో.

Related Posts