YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

కుర్రాడితో ఆంటీ ఎఫైర్... కుమ్మేసిన స్థానికులు

కుర్రాడితో ఆంటీ ఎఫైర్... కుమ్మేసిన స్థానికులు

లక్నో, జూలై 14, 
వాహ కట్టుబాట్లను కాలదన్ని పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు గ్రామస్థులు తగిన బుద్ధి చెప్పారు. ప్రియుడితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని స్తంభానికి కట్టేసి ఇద్దరికీ దేహశుద్ధి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మోతీహరి జిల్లా బేలా గ్రామానికి మహిళకు కొంతకాలం క్రితం వివాహమై, ముగ్గురు పిల్లలున్నారు. భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది.భర్త అడ్డు లేకపోవడంతో ఆమె ప్రియుడిని రోజూ ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగించేది. మహిళ ప్రవర్తనను గమనించిన స్థానికులు పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా వినిపించుకోకుండా మరింత రెచ్చిపోయేది. దీంతో ఆమెకు బుద్ధి చెప్పాలనుకున్న స్థానిక మహిళలు సమయం కోసం వేచిచూశారు. శనివారం ప్రియుడిని రప్పించుకుని గదిలో రాసలీలలు కొనసాగిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ర్ధనగ్నంగా ఉండగానే ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి స్తంభానికి కట్టేశారు. స్థానిక మహిళలు కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌‌మీడియాలో పోస్ట్ చేయడంత వైరల్‌గా మారింది. అనైతిక సంబంధాన్ని కొనసాగిస్తున్న వారిని పెళ్లి చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు.

Related Posts