న్యూఢిల్లీ, జూలై 14,
దేశవ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలకు చేరి రికార్డు సృష్టించగా.. 24 గంటల్లో 27 వేల కేసులు నమోదవడం మరో రికార్డు. తాజాగా నమోదైన 27,114 కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8,20,916 కు చేరింది. వైరస్ బాధితుల్లో 519 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 22,213 కు చేరింది. ఇక 2,38,461 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. 1,30,261 కేసులతో తమిళనాడు, 1,09,140 కేసులతో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5,15,386 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. రికవరీ రేటు 62.78 శాతంగా ఉండటం శుభపరిణామం. మరణాల రేటు 2.72 శాతంగా ఉండటం ఊరటనిచ్చే విషయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,83,407 మంది కోవిడ్ బాధితులు ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు కోటి 13 లక్షల నమూనాలు పరీక్షించామని జాతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజే 2,82,511 టెస్టులు చేశామని వెల్లడించింది. ఇదిలాఉండగా.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా 32,91,786 కేసులతో మొదటి స్థానంలో, బ్రెజిల్ 18,04,338 కేసులతో రెండో స్థానంలో ఉన్నాయి.భారత్‌లో తొలి కరోనా వైరస్ కేసు జనవరి 21న నమోదైంది. ఒక్క కరోనా కేసు నుంచి లక్ష కేసులు చేరుకోవడానికి 110 రోజులు పట్టగా అక్కడి నుంచి 7 లక్షలకు కేవలం 49 రోజుల సమయం మాత్రమే తీసుకుంది. అయితే 7 లక్షల నుంచి 8లక్షలు దాటడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే పట్టింది. మూడు రోజుల్లోనే లక్ష కేసులు.. భారత్‌లో కరోనా ఎంతలా విజృంభిస్తోంది అని చెప్పడానికి ఇది చాలు. తాజాగా గత 24 గంటల్లో మరో 27 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల మార్క్‌ను దాటేసింది. రాష్ట్రాల వారిగా చూస్తే అత్యధిక కరోనా కేసులతో మహారాష్ట్ర(2,30,599) మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు 1,30, 261 కేసులతో రెండో స్థానంలో, ఢిల్లీ 1,07, 051 కేసులతో మూడో స్థానంలో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా నమోదైన 8లక్షల పైచిలుకు కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల్లనే 4,67, 911 కేసులు ఉన్నాయి. దేశంలో 70 శాతం కేసులు ఈ మూడు రాష్ట్రాల నుంచి వస్తే, మిగతా 30 శాతం ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నాయి. కాగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 21,604 ఉండగా.. 80 శాతం మరణాలు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులోనే ఉన్నాయి.
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 2,76,685 కాగా, 4,95,512 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. గత 24 గంటల్లో 19,138 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 62.42 శాతానికి చేరడం కొంత ఊరట కలిగించే అంశం. ఇక కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అగ్రరాజ్యం అమెరికా 32, 46,767 కేసులతో మొదటి స్థానం, బ్రెజిల్ 17,62,263 కేసులతో రెండో స్థానంలో ఉన్నాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తుంది. గురువారం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 65,551 కేసులు నమోదయ్యాయి. ఇక శనివారం నాడు ఒక్కరోజులో 70 వేల పాజిటివ్ కేసులు నమోదు కావడం సరికొత్త రికార్డుగా చెబుతున్నారు. ఇక ఇప్పటివరకు కరోనాతో ప్రపంచవ్యాప్తంగా 5.54 లక్షల మరణాలు చోటు చేసుకోగా.. కేసుల సంఖ్య కోటీ 22 లక్షలు దాటేసింది.