YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

వ్యాక్సిన్ రేసులో దేశాలు పోటీ

వ్యాక్సిన్ రేసులో దేశాలు పోటీ

లండన్, జూలై 14, 
దేశంలో కరోనా కేసుల తీవ్రత బాగా పెరిగింది. గత వారం రోజులుగా కేసుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఏరోజుకారోజు కేసులు పెరుగుతూనే వున్నాయి. గడచిన 24 గంటల్లో 28,701 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 23,174గా నమోదయ్యాయి. మహారాష్ట్రలో కోవిడ్ ఉధృతి ఎక్కువగావుంది. ఒక్కరోజే 8 వేల కేసులు నమోదయ్యాయి.పుణెలోని ఎయిమ్స్ వైద్యులు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. 18మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. ఈ ఏడాది చివరినాటికి భారతీయ వ్యాక్సిన్ కూడా ఒక దశకు రానుంది. కోవిడ్ కేసుల్లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో వున్నాయి. కోవిడ్ కేసుల సంఖ్య మొత్తం కోటి 30లక్షల, 36 వేలు దాటాయి. మరణాల సంఖ్య 5 లక్షల 71 వేలు దాటాయి. ప్రపంచంలోనే తొలిసారిగా రష్యాలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం కరోనాని తరిమికొట్టగలమన్న ఆశల్ని పెంచుతోంది. రష్యాలోని సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్సిటీ చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగం కీలక దశలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసినట్టుగా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ అండ్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌ వాదిమ్‌ తారాసోవ్‌ వెల్లడించారు.గమలి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయోలజీ కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను జూన్‌ 18 నుంచి ప్రారంభించింది.వ్యాక్సిన్‌ను పరీక్షించిన వాలంటీర్లలో మొదటి బృందాన్ని బుధవారం డిశ్చార్జ్‌ చేస్తారు. రెండో బృందం వాలంటీర్లను జూలై 20న డిశ్చార్జ్‌ చేయనున్నట్టుగా తారాసోవ్‌ తెలిపారు. టీకా భద్రత పరీక్షలు కూడా దిగ్విజయంగా పూర్తయ్యాయి. వ్యాక్సిన్‌ భద్రత పరీక్షలు కూడా పూర్తి కావడంతో ఇక వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సెచెనోవ్‌ యూనివర్సిటీ దృష్టి సారించనుంది. వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది. కాగా గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లండన్‌కి చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ అత్యంత పురోగతిలో ఉందని వెల్లడించింది. ఆ వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది. ఇప్పుడు రష్యా యూనివర్సిటీ అన్ని దశల క్లినికల్‌ ట్రయల్స్‌ని పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. మరోవైపు 2021 కంటే ముందు కరోనా మహమ్మారిపై 100 శాతం సమర్థవంతంగా పనిచేసే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు తక్కువే అంటున్నారు ఫ్రాన్స్ కి చెందిన శాస్త్రవేత్తలు. కరోనాపై పోరాడే శక్తి కలిగిన వ్యాక్సిన్ల పై పరిశోధనలు సాగుతున్నాయి. పాక్షికంగా పనిచేసే టీకాలు రావచ్చు. కానీ పూర్తిస్థాయిలో నియంత్రించే శక్తి కావాలంటే ఇంకా పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ ఇంకా పెరగాలంటున్నారు. క్లోజ్డ్ ఏరియాలు, జనసమ్మర్థం ఎక్కువగా ఉండేచోట కఠినమయిన ఆంక్షలుండాలని అంటున్నారు.

Related Posts