సిద్దిపేట జూలై 14,
సోమవారం రాత్రి వెళలో సిద్దిపేట సానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ సిద్దిపేట పట్టణంలో పారిశుధ్ద్య పనులను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట శ్రీనివాస్ థియేటర్ పక్కన ఓ ఇంటి ముందు చెత్త కనపడింది. దాంతో అయన ఆ ఇంటి యజమానిని బయటకు పిలిచి రోడ్డు పై వేసిన చెత్తను తీయించారు. దాన్ని ఆ యాజమని ఇంట్లోనే వెయించారు. . అదేవిధంగా సందీప్ లాడ్జ్ సిబ్బంది కూడా రోడ్డు పై చెత్త వేస్తున్నారని గమనించి వారిని వెంబడించి మరి పట్టుకున్నారు. ఆ చెత్తను వారితోనే తీయించారు. చెత్త బండి వస్తుంది తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి. ఇలా రోడ్డు పై వేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. సంగతి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సతీష్ ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో చెత్త రోడ్డు పై వేయకుండా అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని చెప్పారు.