YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరోనా తో మృతి చెందిన జర్నలిస్టులకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

కరోనా తో మృతి చెందిన జర్నలిస్టులకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

నెల్లూరు జూలై 15,
కరోనా పాజిటివ్ తో మృతి చెందిన జర్నలిస్టులకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే నెల్లూరుశ్యాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.మంగళవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన పార్థసారధి సివిఆర్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ సంతాప సభలో జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ,ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, పారిశుద్ధ్య కార్మికుల తో పాటు జర్నలిస్టుల ను కూడా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.కరోనా సోకిన ప్రతి జర్నలిస్టులకు 20వేల రూపాయలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను జర్నలిస్టులు ఎదుర్కొంటున్నరు అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన ఇన్సూరెన్స్ పాలసీ కూడా జర్నలిస్టుల కూడా వర్తింపజేయాలని, కరోనా విధినిర్వహణలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించలని వారు కోరారు.ఇప్పటికే జర్నలిస్టులు దేశవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం  లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని, పార్థసారథి కుటుంబానికి తక్షణమే 50 లక్షలు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏ. జే. ప్రకాష్ జిల్లా అధ్యక్షుడు వి. వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి  టి. రమేష్ బాబు తదితరులు పాల్గొని పార్థసారథి కి ఘనంగా నివాళులు అర్పించారు .

Related Posts