YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

నేపాల్ ప్రధాని వ్యాఖ్యాలను ఖండించిన స్వరూపానందేంద్ర

నేపాల్ ప్రధాని వ్యాఖ్యాలను ఖండించిన స్వరూపానందేంద్ర

విశాఖపట్నం జూలై 15,
శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి  స్వరూపానందేంద్ర ఖండించారు.  స్వరూపానంద మాట్లాడుతూ రాముడు భారతీయుల ఆరాధ్య దైవం. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడని అన్నారు. భారత్ లో జన్మించి ప్రపంచానికే నడవడికను నేర్పాడు శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలిసీ తెలియని మాటలు తగదు. కుహనా కుట్ర రాజకీయాలతో నేపాల్ మాట్లాడటం దుర్మార్గపు ఆలోచన అని వ్యాఖ్యానించారు. ప్రాచీన చరిత్రను వక్రీకరించడం సబబు కాదు.  నేపాల్ తన తప్పుడు ప్రచారాన్ని ఆపాలని అయన అన్నారు.

Related Posts