YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించిన డీజీపీ

అపరేషన్ ముస్కాన్ ను ప్రారంభించిన డీజీపీ

అమరావతి జూలై 15,
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 కార్యక్రమాన్ని మంగళవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ  కోవిడ్ కంట్రోల్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే మొదటసారిగా ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19కు శ్రీకారం చుట్టాము.  అందులో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, వివిధ కర్మాగారాల్లో బాలకార్మికులుగా, అనాదలుగా రోడ్లపైన తిరుగుతున్న వారిని రెస్క్యూ చేస్తారు.  కార్యక్రమంలో పోలీస్, సీఐడీ, మున్సిపల్, ఐసీడీఎస్, మహిళ శిశు సంక్షేమ శాఖ, చేల్డ్ లైన్, స్వచ్చంధ సంస్థలు పాల్గొంటాయి. ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 ద్వారా రెస్క్యూ చేసిన బాలబాలికలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తారు.  అనంతరం రిపోర్టుల ఆధారంగా అవసరమైన వారిని ఆస్పత్రికి తరలిస్తారు.  పూర్తిగా కోలుకున్న తర్వాత వారిని పునరావాస కేంద్రాలలో చేర్పించి వారికి కావాల్సిన ఉచిత విద్య, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

Related Posts