న్యూ ఢిల్లీ జూలై 15
నర్సరీకి 30నిమిషాలు..
1-8వ తరగతి పిల్లలకు 45 నిమిషాల వ్యవధిలో రెండు సెషన్స్ లు
9 నుంచి 12వ తరగతి వరకు 30-45 నిమిషాల వ్యవధిలో నాలుగు సెషన్స్
కరోనా మహమ్మారి దెబ్బకు చదవులు అటకెక్కాయి. మూడు నెలలు దాటినా బడిగంటలు మోగేలా కనిపించడం లేదు. ఎప్పుడు తెరుస్తాయో కూడా తెలియని పరిస్థితి. కరోనా తగ్గేదెప్పుడు..? స్కూళ్లు తెరిచేదెప్పడు? విద్యార్థులంతా ఆందోళనగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ విద్యాసంస్థలు కొన్ని ఇప్పటికే ఆన్ లైన్ క్లాసుంటూ వేధిస్తున్నాయి. నడిపిస్తున్నాయి కూడా.. విద్యార్థులకు గంటల తరబడి ఆన్ లైన్ క్లాసులంటూ ఫోన్లు ల్యాప్ టాప్ ల ముందు కూర్చుండబెట్టి హింసిస్తున్నాయి. భారీగా తల్లిదండ్రుల నుంచి ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి.ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం మంగళవారం అలెర్ట్ అయ్యింది. ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ‘ప్రగ్యాత’ పేరుతో కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాల్లో నర్సరీ పిల్లలకు కేవలం 30 నిమిషాలు మాత్రమే ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. ఇక 1-8వ తరగతి పిల్లలకు 45 నిమిషాల వ్యవధిలో రెండు సెషన్స్ లు ఏర్పాటు చేయాలని తెలిపింది.ఇక 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు 30-45 నిమిషాల వ్యవధిలో నాలుగు సెషన్స్ లు నిర్వహించాలని సూచించింది.విద్యార్థులకు స్క్రీన్ సమయం పెంచేయడంతో వారిపై ఒత్తిడి పెరుగుతోందని.. వారి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.