అమరావతి జూలై 15,
కరోనా రోగంతో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం జగన్ వరం ఇచ్చారు. ఆ రోగంతో మరణించిన వారి అంత్యక్రియల కోసం రూ.15వేలు ప్రకటించారు. కరోనా రోగుల అంత్యక్రియలను ఎవరూ పట్టించుకోకపోవడం.. వారి అనాథల్లా ఊడ్చేస్తున్న తీరుపై కలత చెందిన జగన్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన మృతుల అంత్యక్రియలు చేసేందుకు వారి కుటుంబాలు కూడా అందుబాటులో ఉండడం లేదు. వారు క్వారంటైన్ లో ఉండడంతో అనాథ శవాల్లా వారు తరలిపోతున్నారు. ఈ కారణంగా కుటుంబాలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ మరణాలపై కరోనా రోగంతో సీఎం జగన్ తీవ్రంగా పరిగణించారు.కరోనా రోగుల మృతదేహాలకు అత్యంత అమానవీయ రీతిలో దహన సంస్కరణలు చేస్తున్న సంఘటనలు ఏపీలో చోటుచేసుకున్నాయి. మృతదేహాలను ట్రాక్టర్లు మరియు జేసీబీలలో దహన ప్రాంతాలకు ఎత్తివేసారు. క్వారంటైన్ లో ఉండే వారి కుటుంబాలకు తుది కర్మలు చూడటానికి లేదా నిర్వహించడానికి అనుమతించ లేదు.దీంతో జగన్ మృతదేహాల అంత్యక్రియలకు రూ.15వేలు ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఇక కరోనా కేసుల్లో చికిత్స చేయడానికి నిరాకరించిన ఆస్పత్రులపై వైయస్ జగన్ కఠినమైన చర్యలు ప్రకటించారు. క్వారంటైన్ కేంద్రాల్లో గుణాత్మక సేవలను అందించడానికి ఒక వారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సిఎం కార్యాలయం అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ అందుబాటులో ఉంచాలని కోరారు.
పరిశుభ్రత మందులు ఆహార నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. రోగులకు చికిత్స చేయడంలో అవాంఛిత సంఘటనలు జరగకుండా.. మరణించిన వారి తుది కర్మలలో కూడా రోజూ ఫీడ్బ్యాక్ సేకరించాలని స్పష్టం చేశారు.